బ్రెజిల్లోని అమెజాన్ వర్షారణ్యాల నరికివేత గతంలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి చేరింది. బ్రెజిల్ అంతరిక్ష పరిశోధనా సంస్థ గణాంకాల ప్రకారం, 202425 మధ్య సుమారు 3,335 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం నరికివేతకు గురైంది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 41.8 తగ్గుదల, 1988 తర్వాత ఇదే అత్యల్పం.
ఈ పరిణామం పర్యావరణ పరిరక్షణలో ఒక ముఖ్యమైన విజయంగా భావిస్తున్నారు. అయితే అడవుల నరికివేత తగ్గిందని మాత్రమే అమెజాన్ అడవులకు ఉన్న అన్ని ప్రమాదాలు తొలగిపోయాయని అనుకోకూడదు.
అమెజాన్ అడవుల ప్రాముఖ్యత
దక్షిణ అమెరికాలో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం అమెజాన్. ఇందులో ఎక్కువ భాగం బ్రెజిల్లో ఉంది. ఈ అడవులు జీవవైవిధ్యానికి, వాతావరణ నియంత్రణకు, ప్రాంతీయ జలచక్రానికి, ఆదివాసీ సమాజాల జీవనాధారానికి కీలకం. ప్రపంచ పర్యావరణ సమతుల్యతకు కూడా ఇవి అత్యంత ముఖ్యం.
నరికివేత గణాంకాలు
బ్రెజిల్ అంతరిక్ష పరిశోధనా సంస్థ , గణాంకాల ప్రకారం, 202425లో అమెజాన్ అడవుల నరికివేత 3,335 చదరపు కిలోమీటర్లకు పరిమితమైంది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 41.8 తగ్గుదల. 201112లో నమోదైన 4,571 చదరపు కిలోమీటర్ల పాత కనిష్ఠ స్థాయిని కూడా తాజా గణాంకాలు అధిగమించాయి.
తగ్గుదలకు కారణాలు
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా ప్రభుత్వం అటవీ నరికివేతను నియంత్రించడంపై దృష్టి సారించింది. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను పునరుద్ధరించడం, పర్యావరణ చట్టాల అమలును బలోపేతం చేయడం, అక్రమ అటవీ నరికివేతపై కఠిన చర్యలు తీసుకోవడం, ఉపగ్రహ నిఘా, రక్షిత ప్రాంతాల నిర్వహణ వంటివి తగ్గుదలకు దోహదపడ్డాయి.
పశువుల పెంపకం, వ్యవసాయం (సోయాబీన్స్ వంటివి), అక్రమ కలప వ్యాపారం, గనుల తవ్వకం, రోడ్లు, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి ఆర్థిక కార్యకలాపాలు అడవుల నరికివేతకు ప్రధాన కారణాలు. ఇవి స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొంత ఆదాయాన్ని అందించినా, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి.
అడవుల నరికివేత తగ్గడం వల్ల జీవవైవిధ్య పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణకు తోడ్పాటు, ఆదివాసీ సమాజాల జీవనాధారానికి రక్షణ వంటి ప్రయోజనాలు చేకూరుతాయి. కార్బన్ నిల్వ చేయడం ద్వారా వాతావరణ మార్పుల ప్రమాదాన్ని తగ్గించడంలో అడవులు కీలక పాత్ర పోషిస్తాయి.
అడవుల నరికివేత తగ్గినా, అడవుల్లో మంటలు, ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్రమయ్యే వేడి, పొడి వాతావరణం, అడవుల క్షీణత వంటి ప్రమాదాలు ఇంకా ఉన్నాయి. 2026 అక్టోబరులో అమెజానాస్ రాష్ట్రంలో అటవీ మంటలు పెరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. కాబట్టి అడవుల మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి మరిన్ని అంశాలను పరిశీలించాలి.
బ్రెజిల్లోని మరో ముఖ్యమైన పర్యావరణ ప్రాంతమైన సెరాడో సవన్నాలోనూ అటవీ నరికివేత తగ్గింది. 202425లో ఇక్కడ 5,517 చదరపు కిలోమీటర్ల భూభాగంలో అటవీ తొలగింపు నమోదైంది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 23.8 తగ్గుదల, 2001 తర్వాత ఇదే అత్యల్పం.











