యెమ్మిగనూరు, 14 October
12వ వార్డులో విద్యుత్ సమస్యలకు పరిష్కారానికి గట్టు అల్తాఫ్ ఆధ్వర్యంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు.
ఎమ్మిగనూరు పట్టణంలోని 12వ వార్డులో గత కొన్ని ఏళ్లుగా నెలకొన్న విద్యుత్ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే డా. బీవీ. జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు, వార్డు ఇన్చార్జి గట్టు అల్తాఫ్ ఆధ్వర్యంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గట్టు అల్తాఫ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపుతున్నారని, వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.












