ఆదోని, 2026-06-05
ఆదోనిభాష్యం2 విద్యార్థులుఇటీవలజరిగినహాకీక్రీడాపోటీల్లోఅద్భుతప్రతిభకనబరిచిరన్నర్స్గానిలిచారు.ఉత్కంఠభరితంగాసాగినఈపోటీల్లోద్వితీయస్థానాన్నిసాధించినవిద్యార్థులకుపాఠశాలచైర్మన్,జెడివోచేతులమీదుగాబహుమతులుఅందజేశారు.
ఆదోని భాష్యం2 స్కూల్ విద్యార్థులు ఇటీవల నిర్వహించిన హాకీ క్రీడా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రన్నర్స్‌గా నిలిచారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో పోరాడి ద్వితీయ స్థానాన్ని సాధించారు. ఈ సందర్భంగా భాష్యం స్కూల్ చైర్మన్ రామకృష్ణ, జెడివో కవిత ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
విద్యార్థుల విజయాన్ని పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ రవి ప్రకాష్, వైస్ ప్రిన్సిపల్ అంజి, హెచ్ఎం రేవతి, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. విద్యార్థులను విజయపథంలో నడిపించిన హాకీ కోచ్, క్రీడా ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.
భాష్యం2 స్కూల్ ఆదోని విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రీడల్లో విద్యార్థుల భాగస్వామ్యం వారి సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని యాజమాన్యం అభిప్రాయపడింది.








