ఆదోని, 2026-08-23
ణతీవగవధసతఫససశశవతూ,సవెఅైీహణసతశఎ.ూఅహడడశ.బహె.
ఆదోని పట్టణాన్ని తీవ్ర ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి చేయడానికి మాస్టర్ ప్లాన్ను తప్పనిసరిగా అమలు చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. గత ముప్ఫై ఎనిమిది సంవత్సరాలుగా కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారుల అవినీతి కారణంగా ఆదోని పట్టణంలో అమలు కావాల్సిన మాస్టర్ ప్లాన్ వాయిదా పడుతూ ఉండటం బాధాకరం, అన్యాయమని ఆయన పేర్కొన్నారు.
ప్రజల ఇబ్బందులు
ట్రాఫిక్ సమస్యల వల్ల ప్రతిరోజూ ఆదోని పట్టణంలో తమ అవసరాల నిమిత్తం, పనుల కోసం తిరిగే స్థానిక, గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నూర్ అహ్మద్ తెలిపారు. నాయకులు, అధికారులు తమ ధన దాహాన్ని తీర్చుకునేందుకు మాస్టర్ ప్లాన్ అమలును అడ్డుకోవడం సిగ్గుచేటని, అమానుషమని ఆయన విమర్శించారు.
అవినీతి ఆరోపణలు
మాస్టర్ ప్లాన్ పేరుతో దుకాణాలు, ఇళ్లకు మార్కింగ్ వేసి, ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి, ప్లాన్ను బుట్టదాఖలు చేస్తూ, గత నలభై ఏళ్లుగా ఆదోని ప్రజలను వంచించడం జరుగుతోందని లోకం కోడై కూస్తోందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే ప్రకటనపై స్పందన
ప్రస్తుతం ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, ఆదోని పట్టణం కోసం మాస్టర్ ప్లాన్ ఆవశ్యకతను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడటం శుభపరిణామమని, దీనిని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇల్లు అలకగానే పండుగ కాదని, మాస్టర్ ప్లాన్ అమలు చేసి రోడ్లు వెడల్పు చేసే వరకు ఆదోని ప్రజలు నాయకులను నమ్మరని ఆయన స్పష్టం చేశారు.
తుది హెచ్చరిక
ఏది ఏమైనప్పటికీ, మాస్టర్ ప్లాన్ అమలు చేయకపోతే నాయకులను ఆదోని ప్రజలు క్షమించరని ఆయన హెచ్చరించారు. తక్షణమే మాస్టర్ ప్లాన్ అమలు ప్రక్రియను ప్రారంభించి, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.






