ఆదోని పట్టణంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఐదు రోజుల పాటు జరిగిన ప్రత్యేక పూజలు, నైవేద్యాల అనంతరం, గణపతి విగ్రహాన్ని భారీ వరేగింపుతో కెనాల్ లొ నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆదోనిలో గణేష్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక షరఫ్ బజార్ వద్ద మండపాలు ఏర్పాటు చేసి, గణేష్ విగ్రహాలను ఉంచి, పెద్ద ఎత్తున పూలమాలలతో అలంకరించారు. ఐదు రోజుల పాటు అనేక రకాల పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పించి, వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి, మంగళహారతులు నిర్వహించారు. పూజల అనంతరం షారఫ్ బజార్ వాసులు 5 రోజుల పాటు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. 5 వ రోజున, బజార్ వాసులు పూజలు నిర్వహించి, కార్యక్రమాన్ని చేపట్టారు. గణపతి విగ్రహాన్ని ట్రాక్టర్ లొ ఉంచి, డిజే సౌండ్లతో ఘనంగా కెనాల్ లొ నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు నిమజ్జనం కార్యక్రమాన్ని విజయవంతంగా ముగిసింది.











