భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ () ప్రక్రియలో ఓటర్లను తొలగించే ఉద్దేశంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహరించారనే ఆరోపణలపై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా () తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియను నిలిపివేయాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
స్థానిక నంద్యాల ఎస్.డి.పి.ఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా ప్రకటనలో రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ గారు మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ () ప్రక్రియకు సంబంధించి ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వెలుగులోకి తెచ్చిన దిగ్భ్రాంతికరమైన విషయాలు, ద్వారా ఓటర్లను తొలగించే ఉద్దేశంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహరించారనే ఆరోపణలకు బలాన్నిస్తున్నాయని తెలిపారు. 2024 ఎన్నికల ప్రక్రియలో మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కనీసం 14 సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. కు సంబంధించిన అనేక నిర్ణయాలు వారి అవగాహన లేకుండానే తీసుకున్నట్లు ఈ అభ్యంతరాలు తెలియజేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, విజేతల విజయ మార్జిన్లు లాజికల్ డిస్క్రెపెన్సీస్ కింద గుర్తించిన ఓట్ల సంఖ్యకు దాదాపు సమానంగా ఉన్నాయని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన అనంతరం తొలగింపులపై దాఖలైన అప్పీళ్లలో 90 శాతానికి పైగా పునరుద్ధరించబడటం, తొలగించబడిన లక్షలాది మంది ఓటర్లు వాస్తవమైన ఓటర్లేనన్న విషయాన్ని నిర్ధారిస్తోంది.
పౌర సమాజం, ప్రతిపక్షాలు నిరంతరం నిరసనలు, అప్పీళ్లు, హెచ్చరికలు చేసినప్పటికీ, మాత్రం ప్రక్రియను మొండిగా అమలు చేశారని విమర్శలు ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దాడిగా, క్షమించరాని చర్యగా పరిగణించాల్సి ఉందని తెలిపారు. అందువల్ల జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈ వ్యవహారంపై పారదర్శకంగా దర్యాప్తు పూర్తయ్యే వరకు ఓటర్ల తొలగింపు ప్రక్రియను సుప్రీంకోర్టు నిలిపివేయాలని కోరారు. సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా () ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ గారు ఈ సందర్భంగా తెలిపారు.











