ఆదోని మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహనీయుడు పండిత్ శ్రీ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డా. పి వి. పార్థసారథి ఆదేశాల మేరకు, జిల్లా బీజేపీ పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వాల్మీకి మహాదేవ్, కర్నూలు జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు (ఎక్స్ కౌన్సిలర్) ఏవి సురేష్, వాల్మీకి బంక ముని, రామకృష్ణ, వాల్మీకి చంద్ర, రామాంజనేయులు, నాగిరెడ్డి, మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











