ఆదోనిలోని నారాయణ పాఠశాలలో జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏ. జి. మ్ అన్వార్ బాషా గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అన్వార్ బాషా మాట్లాడుతూ, సత్యం, అహింస అనే ఆయుధాలతో బ్రిటీష్ పాలకులను ఎదిరించి, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన చూపిన మార్గం కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచదేశాలన్నింటికీ ఆదర్శప్రాయం. నేటి యువత గాంధీజీ ఆశయాలను, ఆయన నైతిక విలువలను అలవర్చుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నారాయణ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీ లక్ష్మి రెడ్డి మాట్లాడుతూ, పరిశుభ్రత అనేది దైవత్వంతో సమానమని అన్నారు. ఈ గాంధీ జయంతి రోజున మన పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేద్దామని, ఆరోగ్యకరమైన, అందమైన భారతదేశాన్ని నిర్మిద్దామని ఆమె పిలుపునిచ్చారు.
గాంధీజీ నినాదాలైన సత్యమే నా సర్వస్వం, అహింస నా ఆయుధం, శాంతి మార్గంలో సాగుదాం... బాపూజీ కలలను నిజం చేద్దాం, జాతిపితకు నివాళి... స్వచ్ఛ భారత్కు జైకొడదాం వంటి వాటిని ఆమె అందరికీ వివరించారు.
కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు గాంధీజీ ఇష్టమైన రఘుపతి రాఘవ రాజారామ్ భజన గీతాన్ని ఆలపించారు. అనంతరం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యతను వివరిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు పాల్గొని బాపూజీకి అంజలి ఘటించారు.










