జిల్లాలోని ప్రకటించడంలో వైఫల్యం ఉందని మాజీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధికి కృషి చేస్తుంటే, కొందరు అధికారులు లంచాలకు పాల్పడి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని ఆయన విమర్శించారు.
ప్రకటించకపోవడానికి నిర్లక్ష్యమే పూర్తి కారణమని తిక్కారెడ్డి అన్నారు. ఈ ప్రాంతాల్లోని పులికనుమ రిజర్వాయర్లో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, కనీసం శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలలో అభిషేకానికి కూడా నీటి కొరత ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వమే చెల్లించాల్సిన పంటల బీమాను అధికారులు ఎకరానికి 12 వేల నుంచి 50 వేల రూపాయల వరకు రైతులచేత బలవంతంగా కట్టించారని, దీనివల్ల రైతులు అప్పులపాలయ్యారని తిక్కారెడ్డి ఆరోపించారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి, రెండో విడతలోనైనా ఈ ప్రకటించేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.


