పుంగనూరు ఘటనపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఓటమి భయంతోనే పుంగనూరులో వైసీపీ వికృత చేష్టలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.
టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన విధంగానే, ఇప్పుడు కూడా దాడులకు పాల్పడి ఆ నిందను కూటమిపై నెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్లు అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తుంటే, వైసీపీ మాత్రం చెడు ఆలోచనలతో గొడ్డలి పార్టీలా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
ఇటీవల వైసీపీ ఎంపీ తీరును ప్రజలంతా గమనించారని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతతో అన్ని స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.










