ఆదోని-2 లోని భాష్యం స్కూల్లో బ్రిక్స్ లైఫ్ స్టైల్ వారోత్సవాలలో భాగంగా పర్యావరణ అవగాహన సదస్సును నిర్వహించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మిల్లెట్స్ వాడకం, ఆహార వృధాను తగ్గించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ రామకృష్ణ, జె.డి.ఓ. మాచాని కవిత, ఫారెస్ట్ ఆఫీసర్ సి. విజయభాస్కర్ రెడ్డి హాజరయ్యారు.
ఆదోని లోని భాష్యం2 స్కూల్ చైర్మన్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, జె.డి.ఓ. మాచాని కవిత మేడం సమక్షంలో, కర్నూలు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఆదేశాల మేరకు, ఆదోని పట్టణంలోని భాష్యం స్కూల్లో బ్రిక్స్ లైఫ్ స్టైల్ వారోత్సవాలలో భాగంగా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, మిల్లెట్స్ ఈటింగ్, ఫుడ్ వేస్ట్ తగ్గించడం వంటి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆదోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సి. విజయభాస్కర్ రెడ్డి, ఎఫ్.బి.ఓ. పి. రఘురాముడు, భాష్యం ప్రిన్సిపాల్ జాఫర్ మాట్లాడారు. భారత ప్రభుత్వ మై భారత్ మరియు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పర్యావరణ అనుకూల జీవనశైలి వారోత్సవాల కింద ఈ పర్యావరణ అవగాహన సదస్సును చేపట్టారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, శక్తి మరియు నీటిని ఆదా చేయడం, అనునిత్యం పర్యావరణ అనుకూల అలవాట్లను పాటించడంపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ప్రాంగణంలో అటవీ శాఖ అధికారులతో కలిసి విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అడవులను, వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన బాధ్యతను అధికారుల బృందం వివరించింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అంజి, హెచ్ఎం రేవతి, మరియు ఉపాధ్యాయుల బృందం పాల్గొనడం జరిగింది.












