ఎమ్మిగనూరు, 10 September
ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది
ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే. గ్రామానికి చెందిన బి. వెంకటేష్ (37) గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఇంటి వద్దనే ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన మదిరి నరసింహులు (70) ఉదయం 9 గంటల సమయంలో ఛాతీలో తీవ్ర నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఒకే రోజు రెండు మరణాలు సంభవించడంతో బోడబండ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.












