ఎమ్మిగనూరు, 14 September
తపపసూపటటణోఏపటసజడడ.సభఆసపతపూజ,ొసపఆపొ.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయలు సమర్పించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. వినాయక మండపాల నిర్వాహకులు ఎమ్మెల్యే బీవీకి ఘన స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, యువత, భక్తులు తదితరులు పాల్గొన్నారు.











