నిజాంసాగర్, 3 September
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని 40 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి () కింద 19.53 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
CMRF ద్వారా బాధిత కుటుంబాలకు అండగా.. 40 మంది లబ్ధిదారులకు ₹19.53 లక్షల చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరులోని R&B గెస్ట్ హౌస్‌లో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను 40 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగ మొత్తం ₹19.53 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటివరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 393 మంది లబ్ధిదారులకు సుమారు ₹3.08 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం అందించామని, అర్హులైన ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో తన భార్య శ్రీమతి బోయ రంగమ్మ గారిని కోల్పోయిన MS నగర్‌కు చెందిన శ్రీ బోయ కేశన్న గారికి ₹5 లక్షల తెలుగుదేశం పార్టీ సభ్యత్వ క్లెయిమ్ క్రెడిట్ లెటర్‌ను ఎమ్మెల్యే అందజేశారు. కార్యకర్తకు కష్టం వచ్చినప్పుడు పార్టీ అండగా ఉంటుంది.. ప్రతి కార్యకర్త కుటుంబానికి తెలుగుదేశం పార్టీ భరోసాగా నిలుస్తుంది అని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్, టౌన్ బ్యాంకు చైర్మన్, టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు, మండల మరియు పట్టణ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.











