ఎమ్మిగనూరు, 2026-06-05
పేద, అర్హులైన కుటుంబాల వార్డులో పర్యటన చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్థానిక పర్యటన డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని 10వ వార్డులో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన విస్తృతంగా పర్యటించారు.
పేద, అర్హులైన కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని 10వ వార్డులో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వార్డులోని ప్రతి ఇంటినీ సందర్శించి, ప్రజలతో మమేకమయ్యారు.
పథకాల అమలు తీరుపై ఆరా
ప్రచారంలో భాగంగా గడపగడపకూ వెళ్లిన ఎమ్మెల్యే.. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీలు, ఇతర సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ పథకాల ద్వారా వారికి నేరుగా కలుగుతున్న ప్రయోజనాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
నిలిచిపోయిన పాఠశాల భవనం పరిశీలన
పర్యటనలో భాగంగా, ప్రస్తుతం కార్యకలాపాలు నిలిచిపోయి నిరుపయోగంగా ఉన్న ఒక పాఠశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. భవనాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చి, విద్యార్థులకు అందుబాటులోకి తేవడానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం
గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంతో పాటు, ప్రతి వార్డులోనూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడమే మా ధ్యేయం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


