ఎమ్మిగనూరు, 2026-06-05
పటటణం . 157.42 కట వయయంత చేపటట శాశవత తాీట పథకాక ెయే జయాేశవెడడ శంకసథాప చేశా. ఈ పథకం దవాా 92 కీట ే పైపై ప, 9 కొతత వాట టయాంక ాణం జతంద.
రూ. 157.42 కోట్లతో ఎమ్మిగనూరులో చేపట్టనున్న శాశ్వత తాగునీటి పథకం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, భూమిపూజ నిర్వహించారు. ఈ పథకం కింద 92 కిలోమీటర్ల మేర పైప్లైన్ పనులు, 9 కొత్త ఓహెచ్ఎస్ఆర్ (ఓవర్హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్) వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపడతారని ఎమ్మెల్యే బీవీ తెలిపారు. కాంట్రాక్టు సంస్థ ఈ పనులను 20 నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
గత పాలకులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల పేరుతో రోడ్లను గుంతలమయం చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఎమ్మెల్యే విమర్శించారు. తాగునీటి పైప్లైన్ పనులు పూర్తయిన వెంటనే పట్టణంలోని అన్ని శివారు ప్రాంతాలు, ప్రధాన వీధుల్లో నూతన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, అంతవరకు మహిళలు సహకరించాలని కోరారు.







