ఎమ్మిగనూరు, 2026-08-22
నందవరం మండలం పెద్ద కొత్తిలి గ్రామంలో బూత్ నం. 05 పరిధిలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి. జయ నాగేశ్వర్ రెడ్డి మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గ్రామంలో ఇంటింటా పర్యటించి ప్రజలను నేరుగా కలుసుకున్నారు.
నందవరం మండలం పెద్ద కొత్తిలి గ్రామంలో బూత్ నం. 05 పరిధిలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి. జయ నాగేశ్వర్ రెడ్డి మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న 45 రోజుల ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు గ్రామంలో ఇంటింటా పర్యటించి ప్రజలను నేరుగా కలుసుకున్నారు.
ప్రజల సమస్యలు తెలుసుకున్న నాయకులు
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కురువ మల్లయ్య, మండల పార్టీ అధ్యక్షులు కాశీం వలి, సొసైటీ చైర్మన్ గోపాల, క్లస్టర్ వన్ ఇంచార్జ్ కురువ వీరేష్ పాల్గొని గ్రామంలోని ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు, అవసరాలు మరియు అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.
ప్రభుత్వ పథకాలపై వివరణ
ఈసందర్భంగా భాస్కర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన వారికి సామాజిక భద్రత కల్పించే పెన్షన్ పథకం, తల్లికి వందనం, విద్యార్థుల విద్యాభ్యాసానికి తల్లులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం, దీపం2 పథకం అర్హులైన కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల ద్వారా మహిళలకు, కుటుంబాలకు ఉపశమనం కల్పించే పథకం, అన్న క్యాంటీన్లు పేద మరియు సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో భోజనం అందించే కార్యక్రమం, రైతుల సంక్షేమం, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం, వ్యవసాయ రంగ అభివృద్ధి, సాగుకు అవసరమైన మద్దతు కార్యక్రమాల గురించి వివరించారు. మహిళా సాధికారత, మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచే వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు.
అభివృద్ధి, సంక్షేమ ఫలాలపై అవగాహన
అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను గ్రామస్తులకు వివరించారు. ప్రతి ఇంటికి ఇంటింటా తెలుగుదేశం కరపత్రాలను అందజేస్తూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి కుటుంబానికి అభివృద్ధి ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం అనే లక్ష్యంతో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు.
పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు











