ఎమ్మిగనూరు, 10 September
గోనెగండ్ల మండలంలో ఐపీపీ సర్వసభ జరిచింది. మండల పరిషత్ అధ్యక్షుడు (ఐపీపీ) టీ. నసురుదీన్ అధ్యక్షత జరించారు, ప్రజా సమస్యలపై చర్చ చేసారు.
గోనెగండ్ల మండల ఎంపీడీవో కార్యాలయ సమావేశ ప్రాంగణంలో గురువారం మండల సర్వసభ సమావేశం మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) టీ. నసురుద్దీన్ అధ్యక్షతన అత్యంత కోలాహలంగా నిర్వహించారు.ఈ సమావేశంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, తాగునీరు, రహదారులు, విద్యుత్ సరఫరా, ఉపాధి హామీ పనులు మరియు సంక్షేమ పథకాల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. అధికారులందరూ సమన్వయంతో వ్యవహరించి ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎంపీపీ సూచించారు.
ఐదేళ్ల సేవలకు ఎంపీటీసీలకు సన్మానం: ప్రస్తుత పాలకవర్గం ఐదేళ్ల పదవీకాలం విజయవంతంగా పూర్తి కావడంతో, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన ఎంపీటీసీ సభ్యులందరినీ ఎంపీపీ మరియు అధికారులు శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ప్రజాసేవలో ఎంపీటీసీలు అందించిన సేవలు అభినందనీయమని, భవిష్యత్తులో కూడా వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో కొనసాగాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో), తహశీల్దార్, వివిధ శాఖల అధికారులు, మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

