మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ (సూర్య పత్రిక) సెప్టెంబర్ 07
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన లీడర్షిప్ కాంక్లేవ్ శిక్షణా కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో లీడర్షిప్ కాంక్లేవ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే బి.వి. జయ నాగేశ్వర రెడ్డి మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్షిప్ కాంక్లేవ్ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణలో నియోజకవర్గ అభివృద్ధి, సాగునీరు–తాగునీటి ప్రాజెక్టులు, ప్రస్తుత కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతం తదితర అంశాలపై మార్గదర్శనం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జీలు, పార్లమెంట్ అధ్యక్షులు, జోనల్ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు.. అభివృద్ధి, సంక్షేమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరం.











