వెంకటేష్ (సూర్య పత్రిక) అక్టోబర్ 06
ఎమ్మిగనూరు మండలంలోని 11 గ్రామాల్లో రూ.1.91 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా భూమిపూజ నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పనులు ప్రారంభమయ్యాయి.
ఎమ్మిగనూరు మండలంలోని పలు గ్రామాల్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు, మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మంజూరైన పనులకు తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి ఘనంగా భూమిపూజ నిర్వహించారు. మండల పరిధిలోని దేవిబెట్ట, కోటేకల్, మల్కాపురం, వెంకటగిరి, కందనాతి, కడివెళ్ల, ఎస్.నాగలాపురం, సిరాలదొడ్డి, కడిమెట్ల, రాళ్లదొడ్డి, కే.తిమ్మాపురం తదితర 11 గ్రామాల్లో దాదాపు రూ.1.91 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సిమెంటు రహదారులు, డ్రైనేజీ నిర్మాణ పనులకు లాంఛనంగా భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు కేటీ మాట్లాడుతూ.. పల్లెపండుగ పథకం ద్వారా ఎమ్మిగనూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామాల్లో దశాబ్దాలుగా ఉన్న రహదారులు, మురుగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు, ప్రతి ఇంటికీ తాగునీరు అందించే లక్ష్యంతో నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు, గుత్తేదారులకు సూచించారు. ఒకేసారి తమ గ్రామాల్లో పెద్ద ఎత్తున సిమెంటు రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు జరగడంపై ఆయా గ్రామాల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే డా. బివి జయ నాగేశ్వర్ రెడ్డికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పార్లపల్లి రాజేష్, క్లస్టర్ ఇన్ఛార్జులు చాన్నపురం నాగరాజు, సుమన్దొడ్డి హనుమంతు, సొగనూరు రాఘవేంద్ర, కో-క్లస్టర్ నాయకులు మురళీకృష్ణారెడ్డి, మసీదుపురం రఘు, మండల నాయకులు సోగునూరు జగదీష్, బోడకొండ సురేష్, ప్రాథమిక సహకార సొసైటీ చైర్మన్ దూదేకుల గౌస్ పీరా, సొసైటీ డైరెక్టర్ గుడేకల్ దేవదాస్ పాల్గొన్నారు. అలాగే 11 గ్రామాల పార్టీ అధ్యక్షులు దేవబెట్ట మహేంద్ర, కోటేకల్ నాగయ్య, మల్కాపురం వీరేష్, వెంకటగిరి వీరప్ప నాయుడు, కందనాతి కేశన్న, కడివెళ్ల గుట్టప్ప, ఎస్.నాగలాపురం వీరాంజనేయులు, సిరాలదొడ్డి పార్థసారథి, కడిమెట్ల పెద్దయ్య, రాళ్లదొడ్డి , తిమ్మాపురం రంగన్న, బోడబండ రామకృష్ణ తదితరులతో పాటు అధికారులు ఎంపీడీవో బంగారమ్మ, ఏపీవో నూర్జహాన్, పంచాయతీ రాజ్ ఏఈ నాగరాజు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది, కూటమి కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











