ఆదోని, 21 October
కర్నూలు జిల్లా ఆదోనిలోని 48వ వార్డు, బావాజీపేట-1 నుండి భారతీయ జనతా పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా ఏవి సురేష్‌కు పార్టీ బి-ఫామ్ అందజేసింది. ఆదోని బీజేపీ క్యాంప్ ఆఫీస్‌లో పార్టీ పెద్దలు, నాయకుల నిర్ణయం మేరకు ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, విట్ట రమేష్, దేశాయ్ చంద్రన్న, లాయర్ శ్రీరాములు, మధుసూదన్ శర్మ, నాగరాజు గౌడ్, ఉపేంద్ర తదితర నాయకుల సహకారానికి, ఆశీస్సులకు ఏవి సురేష్ కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా రాష్ట్ర నాయకులు పీవీఎన్ మాధవ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగోల గోపి శ్రీనివాస్, జిల్లా నాయకులు రామకృష్ణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉల్చాల లక్ష్మయ్య, జిల్లా ఓబిసి మోర్చా ఇంచార్జి అశోక్, బండి అనంత ఇతర నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వార్డు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని ఏవి సురేష్ పేర్కొన్నారు.