ఎమ్మిగనూరు పట్టణంలోని 32వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎరుకల పరమేష్ ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వార్డు అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించేందుకు తనకు ఒక అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వార్డు అభివృద్ధికి తన వంతు బాధ్యతగా పనిచేస్తానని పరమేష్ పేర్కొన్నారు.
ఈ ప్రచారంలో స్థానికులు, టీడీపీ నాయకులు ఉరుకుందు, నాగరాజు, రామకృష్ణ, కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.









