ఎమ్మిగనూరు, 26 September
ఎమ్మిగనూరు: బ్యాంకులో రూ. 2 లక్షల నగదును ఎత్తుకెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు
ఎమ్మిగనూరు : పట్టణంలో దుండగులు రెచ్చిపోయారు. కెనరా బ్యాంకులో రూ. 2 లక్షలు విత్డ్రా చేసుకుని వెళ్తున్న రంగారెడ్డి అనే రైతును ఓ అపరిచిత వ్యక్తి వెంబడించాడు. వైఎస్ఆర్ సర్కిల్లోని లక్ష్మీ స్వీట్స్ షాప్ ముందు రైతు తన బైక్ నిలిపి లోపలికి వెళ్లగా, అదే అదనుగా భావించిన దుండగుడు బైక్ ట్యాంక్ కవర్లో ఉన్న రూ. 2 లక్షల నగదును ఎత్తుకెళ్లాడు.
బాధితుని ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.







