ఆదోని-2, ఆదోని (సూర్య పత్రిక) సెప్టెంబర్ 05
ఆదోని: భాష్యం స్కూల్ ఆదోని-2లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
భాష్యం చైర్మన్ రామకృష్ణ జె డి వో మాచని కవిత ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా భాష్యం స్కూల్ 2 ఆదోని ఆదోని: భాష్యం స్కూల్ 2 ఆదోని లో న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు, పాటలు మరియు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఉపాధ్యాయుల సేవలను, విద్యార్థుల జీవితాల్లో వారి పాత్రను కొనియాడారు. పాఠశాల ప్రిన్సిపాల్ రవి ప్రకాష్ మాట్లాడుతూ, “విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పది. ఉపాధ్యాయులను గౌరవించడం ప్రతి విద్యార్థి బాధ్యత” అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ అంజి హెచ్ఎం రేవతి ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది.










