ఆదోని, 15 September
కర్నూలు జిల్లా ఆదోనిలోని నారాయణ పాఠశాలలో వినాయక చవితి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజియం అన్వర్ భాష హాజరయ్యారు. వినాయక చవితి పండుగ ప్రాముఖ్యతను, దాని చారిత్రక నేపథ్యాన్ని ఈ సందర్భంగా వివరించారు.
కర్నూలు జిల్లా ఆదోనిలోని నారాయణ పాఠశాలలో వినాయక చవితి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజియం అన్వర్ భాష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినాయక చవితి అనేది విఘ్నాలను తొలగించి బుద్ధి, సిద్ధి, ఐశ్వర్యాన్ని ప్రసాదించే గణేశుని జన్మదినంగా హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ అని తెలిపారు. బాలగంగాధర్ తిలక్ ఈ పండుగను స్వాతంత్ర్యోద్యమ కాలంలో సామూహిక వేదికగా (సార్వజనిక్ గణేశోత్సవ్) మలచి, దేశ సమైక్యతకు ఆయుధంగా మార్చారని ఆయన గుర్తు చేశారు. ఈ సభకు అధ్యక్షత వహించిన ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీ లక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ, ఏ కార్యమైనా ప్రారంభించే ముందు వినాయకుడిని స్మరిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని నమ్ముతారని తెలిపారు. అందుకే దీనిని విఘ్నేశ్వరుని పూజగా ఆచరిస్తారు. కుమారస్వామి నెమలి వాహనంపై బయలుదేరగా, గజాననుడు తల్లిదండ్రులే సమస్త విశ్వం అనే భావనతో శివపార్వతులకు మూడు ప్రదక్షిణలు చేసి, నారాయణ మంత్ర సాధనతో సర్వ తీర్థాల ఫలితాన్ని ముందుగా పొంది, గణపతిగా సర్వగణాధ్యక్షుడయ్యాడని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.











