జిల్లా పత్తికొండలో విశాలాంధ్ర విలేకరి నాగరాజుపై సీఐ జయన్న దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఎమ్మిగనూరులో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. న్యూస్ కవరేజ్ కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన విలేకరి నాగరాజును మెడ పట్టి బయటికి గెంటడాన్ని సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి సీఐ జయన్నను వెంటనే సస్పెండ్ చేయాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే తాలూకా ప్రదాన కార్యదర్శి సి నాగరాజు, పట్టణ అధ్యక్షులు పరమేశ్వర, సీనియర్ నాయకులు మగ్బూల్, తాలూకా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం ఈరన్న, తాలూకా సహాయ కార్యదర్శి బాబు రాజు, ఆవుల శ్రీనివాసులు, నాయకులు బాలాజీ, ఎల్లయ్య ఆచారి, సి ఈరన్న, గాజుల వెంకటేష్, రాజు, మహేశ్వర రెడ్డి, హరీ, బనవాసి ఈరన్న, మహానంది, రంగన్న పాల్గొన్నారు.
ఎమ్మిగనూరులో ఏపీయూడబ్ల్యూజే నిరసన
Share:

సారాంశం
జిల్లా పత్తికొండలో విశాలాంధ్ర విలేకరి నాగరాజుపై సీఐ జయన్న దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఎమ్మిగనూరులో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. న్యూస్ కవరేజ్ కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన విలేకరి నాగరాజును మెడ పట్టి బయటికి గెంటడాన్ని సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు.
ముఖ్య విషయాలు
- జిల్లా పత్తికొండలో విశాలాంధ్ర విలేకరి నాగరాజుపై సీఐ జయన్న దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఎమ్మిగనూరులో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
- న్యూస్ కవరేజ్ కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన విలేకరి నాగరాజును మెడ పట్టి బయటికి గెంటడాన్ని సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు.
- ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి సీఐ జయన్నను వెంటనే సస్పెండ్ చేయాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్ చేశారు.
- తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

G Jeelani Basha
Reporter
Andhra Pradesh
52ఆర్టికల్స్
4,116వ్యూస్










