విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఆదోని పట్టణంలో విశ్వనారాయణ జూనియర్ కళాశాలలో నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా డివిజన్ సెక్రెటరీ శివ ఈ మేరకు మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్న సమస్యలపై పోరాడాలని ఆయన సూచించారు.
స్థానిక ఆదోని పట్టణంలో విశ్వనారాయణ జూనియర్ కళాశాలలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివిజన్ సెక్రెటరీ శివ మాట్లాడుతూ, విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కు అని, అయితే నేటి విద్యారంగంలో నెలకొన్న అనేక సమస్యలు విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలు, పెరుగుతున్న విద్యా ఖర్చులు, ఫీజుల భారం, హాస్టళ్ల సమస్యలు, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటివి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన తెలిపారు. విద్యను అందరికీ అందుబాటులో ఉండే హక్కుగా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడంతో పాటు, అవసరమైన నిధులు కేటాయించి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ఆయన సూచించారు.
విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, వసతి, భద్రతతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని, సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరిగే పోరాటాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ విద్యార్థులు, పట్టణ కార్యదర్శి రాజు, అధ్యక్షుడు దస్తగిరి, ముఖ్యులు రాము, అశోక్, అంజి, రాజేష్, రమణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










