ఎమ్మిగనూరు, జూలై 19, 2026
ఎమ్మిగనూరులో కురువ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహనీయుడు శ్రీ కనకదాసు చిత్రపటానికి నివాళులర్పించారు. కురువ సమాజం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావడానికి ఐక్యత అత్యవసరమని ఆయన పిలుపునిచ్చారు.
ఎమ్మిగనూరు పట్టణంలోని బీరలింగేశ్వర కళ్యాణ మండపంలో రాష్ట్ర, జిల్లా కురువ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మహనీయుడు శ్రీ కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కురువ సంఘం కమిటీల ఏర్పాటు, సంఘం బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
కర్నూలు జిల్లా కురువ సంఘం కోశాధికారి కేసీ నాగన్న గారు కర్నూల్ జిల్లా కురువ సంఘం జమా లెక్కలు సభకు వివరించారు.
ఈ సందర్భంగా కురువ సంఘం నాయకులు మాట్లాడుతూ, కురువ సమాజం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరింత బలోపేతం కావాలంటే ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా సమాజ అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సూచించారు.
రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మా కురవ సోదరులకు రాబోయే ఎన్నికలలో మా వాటా మాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కురువ సమాజం ఐక్యతను చాటుతూ, సమిష్టి కృషితో విజయాన్ని సాధించి తమ రాజకీయ శక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యువత సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో కురువల ప్రాతినిధ్యం పెరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే సంఘాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలోపేతం చేయడానికి కమిటీలను సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దాలని, సమాజ సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు, కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి, కర్నూలు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, కర్నూలు జిల్లా కురవ సంఘం కోశాధికారి కేసీ నాగన్న, కర్నూల్ పట్టణ నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు, సహాయక కార్యదర్శి బీసీ తిరుపాల్, రాష్ట్ర కురువ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిల్లే నరేంద్ర, రాష్ట్ర కార్యదర్శి ఆకులేటి అశ్వర్థ నారాయణ, అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు గిరక మురళి, అనంతపురం రూరల్ మండల అధ్యక్షులు బండి ఈశ్వరయ్య, కర్నూలు జిల్లా కురవ సంఘం నాయకులు మద్దిలేటి, కురవ సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు కుంటనహాల్ శివరాం, బూదూర్ లక్ష్మన్న, ఎమ్మిగనూరు కురవ సంఘం నాయకులు ఎర్రకోట అంపయ్య, డిగ్రీ కాలేజ్ మద్దిలేటి సారు, తిమ్మాపురం కేటి ఉరుకుందు, యాపిల్ బీరప్ప, వెంకటాపురం సత్యన్న, కలుగట్ల వీరనాగప్ప, గాజులదిన్నె అనుమంతు, మసీద్ పురం రాముడు, చెన్నాపురం కురువ మల్లయ్య, వై వెంకటేష్, జి వెంకటేష్, గోపాల్, పిల్లిగుండ్ల జయరాముడు, తిమ్మాపురం బడేషా, బనవాసి అయ్యన్న, బనవాసి కృష్ణమూర్తి, బోడబండ హనుమంతు, నరసింహులు, రవికుమార్, ఎర్రకోట యాదగిరి, కోట భాస్కర్, పార్లపల్లి మల్లికార్జున, కురవ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




