పల్లెపాడు (సూర్య పత్రిక) సెప్టెంబర్ 03
పల్లెపాడు గ్రామానికి చెందిన కోసిగి మాజీ ఎంపీపీ స్వర్గీయ వాల్మీకి లక్ష్మిరెడ్డి గారి సతీమణి వాల్మీకి శకుంతలమ్మ వయోభారంతో మృతి చెందారు. ఆమె భౌతికకాయానికి ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి నివాళులర్పించారు.
వాల్మీకి శకుంతలమ్మ గారికి ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి నివాళులు పల్లెపాడు గ్రామానికి చెందిన కోసిగి మాజీ ఎంపీపీ స్వర్గీయ వాల్మీకి లక్ష్మిరెడ్డి గారి సతీమణి వాల్మీకి శకుంతలమ్మ గారు వయోభారంతో స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పల్లెపాడు గ్రామానికి వెళ్లి వారి భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఈ విషాద సమయంలో వారికి మనోధైర్యాన్ని అందించారు. శకుంతలమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము.

