మున్సిపల్ ఎన్నికల్లో 39వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తురేగల్ నజీర్ అహమ్మద్ 837 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై గెలుపొందిన నజీర్ అహమ్మద్ కు పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో 39వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తురేగల్ నజీర్ అహమ్మద్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 837 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు ఆయనకు పట్టం కట్టడంతో 39వ వార్డులో టీడీపీ విజయాన్ని నమోదు చేసింది.
ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. నజీర్ అహమ్మద్ గెలుపు పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఓటు వేసి తన విజయానికి సహకరించిన 39వ వార్డు ప్రజలకు నజీర్ అహమ్మద్ కృతజ్ఞతలు తెలిపారు.











