నారాయణాపూర్, 14 September
ఆదోనిలోని నారాయణ పాఠశాలలో ఈరోజు వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజియం అన్వర్ బాష హాజరయ్యారు. గణపతి ప్రాశస్త్యాన్ని, పండుగ ప్రాముఖ్యతను ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ రెడ్డి వివరించారు.
ఈరోజు ఆదోని నారాయణ పాఠశాల యందు జరిగినటువంటి వినాయక చవితి పూజ కార్యక్రమం లొ ముఖ్యఅతిథిగా ఏజియం అన్వర్ బాష హాజరయ్యారు ఈ కార్యక్రమం ను ఉద్దెశించి వినాయక చవితి అనేది విఘ్నాలను తొలగించి బుద్ధి, సిద్ధి, ఐశ్వర్యాన్ని ప్రసాదించే గణేశుని జన్మదినంగా హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ.బాలగంగాధర్ తిలక్ ఈ పండుగను స్వాతంత్ర్యోద్యమ కాలంలో సామూహిక వేదికగా (సార్వజనిక్ గణేశోత్సవ్) మలచి దేశ సమైక్యతకు ఆయుధంగా మార్చారు. ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీ లక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ ఏ కార్యమైనా ప్రారంభించే ముందు వినాయకుడిని స్మరిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని నమ్ముతారు. అందుకే దీనిని విఘ్నేశ్శ్వర పూజగా ఆచరిస్తారు కుమారస్వామి నెమలి వాహనంపై బయలుదేరగా, గజాననుడు "తల్లిదండ్రులే సమస్త విశ్వం" అనే భావనతో శివపార్వతులకు మూడు ప్రదక్షిణలు చేసి నారాయణ మంత్ర సాధనతో సర్వ తీర్థాల ఫలితాన్ని ముందుగా పొంది 'గణపతి'గా సర్వగణాధ్యక్షుడయ్యాడు.ఈ కార్యక్రమం నందు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొని విజయవంతం చేసారు.











