సారాంశం
జిల్లాలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని రామ్ చరణ్ సతీమణి, అపోలో ప్రతినిధి ఉపాసన గురువారం దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మంత్రాలయానికి చేరుకున్న ఆమెకు శ్రీమఠం అధికారులు ఘన స్వాగతం పలికారు.
ముఖ్య విషయాలు
- 1జిల్లాలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని రామ్ చరణ్ సతీమణి, అపోలో ప్రతినిధి ఉపాసన గురువారం దర్శించుకున్నారు.
- 2ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మంత్రాలయానికి చేరుకున్న ఆమెకు శ్రీమఠం అధికారులు ఘన స్వాగతం పలికారు.
- 3ఆలయ సాంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీ మాంచాలమ్మ అమ్మవారిని, ఆ తర్వాత శ్రీ రాఘవేంద్ర స్వామి వారి నిజ బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- 4ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆమెను సన్మానించి ఆశీర్వదించారు.
జిల్లాలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని రామ్ చరణ్ సతీమణి, అపోలో ప్రతినిధి ఉపాసన గురువారం దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మంత్రాలయానికి చేరుకున్న ఆమెకు శ్రీమఠం అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఆలయ సాంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీ మాంచాలమ్మ అమ్మవారిని, ఆ తర్వాత శ్రీ రాఘవేంద్ర స్వామి వారి నిజ బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆమెను సన్మానించి ఆశీర్వదించారు.
అపోలో మెడికల్ షాప్ ఏర్పాటుపై విజ్ఞప్తి
భక్తుల సౌలభ్యం కోసం మంత్రాలయంలో అపోలో మెడికల్ షాప్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా పీఠాధిపతులు ఉపాసను కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీమఠం అసిస్టెంట్ మేనేజర్ ఐ.పి. నరసింహచార్ పాల్గొన్నారు.