గోనెగండ్ల గోనెగండ్ల మండలం కులుమాల గ్రామాల్లో శ్రీ శ్రీ శ్రీ దస్తగిరయ్య దర్గా గంధం మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మిగనూరు డా. బి.వి. బీవీ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
బీవీ నెలటూరులో టీడీపీ కార్యకర్త ఆనంద్ కుమారుడి రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నాయకుడు చాంద్‌బాషా ఇంట్లో ఏర్పాటు చేసిన విందు భోజనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు మోహన్ రెడ్డి, బుద్దన్న తదితరుల ఇళ్లను సందర్శించి వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ మహోత్సవాలకు భక్తులు, నాయకులు హాజరయ్యారు.











