ఎమ్మిగనూరు, 2026-06-05
రేషన్ దుకాణాల వద్ద నూతనంగా ప్రవేశపెట్టిన డబుల్ స్కానింగ్ విధానంపై ఎమ్మిగనూరు మండల రేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం సమర్పించారు.
రేషన్ దుకాణాల వద్ద నూతనంగా ప్రవేశపెట్టిన డబుల్ స్కానింగ్ విధానంపై ఎమ్మిగనూరు మండల రేషన్ డీలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు సోమలగూడూరు బాషా మాట్లాడుతూ.. గోడౌన్ నుంచి సరుకులు తీసుకునేటప్పుడు ఒకసారి, కార్డుదారులకు పంపిణీ చేసేటప్పుడు మరోసారి ప్రతి బియ్యం బస్తాను ఈ-పాస్ యంత్రంపై ఎత్తి స్కాన్ చేయడం ఆచరణ సాధ్యం కాదని అన్నారు. ఈ ప్రక్రియ వల్ల పంపిణీలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని, లబ్ధిదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రేషన్ బియ్యం దిగుమతి, పంపిణీ సమయాల్లో అమలవుతున్న ఈ నిబంధనను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు ఈరన్న, రాము, తాయప్ప, సాజిద్, ఆనంద్, నరసింహులు, రామకృష్ణ, సలీమ్, రబియా, రఖీబ్, నాగూర్ బాషా, మన్సూర్ బాషా తదితరులు పాల్గొన్నారు.












