ఎమ్మిగనూరు, 2026-06-05
ఎమమిగనూ నిోజకవగంోని ైతక సాగనీటి కషటా తీనననాి. ఎ నినో పభావం, వషాభావ పిసథిత నేపథంో నీటి కోసం ఎదూసతనన ైతక ఊటనిసతూ, ఎమమెే డాకట బీవీ జ నాగేశవ ెడడి ఎకోట గామంోని ... మిటట సోమాపం 1 కావక సాగనీటిని విడద ేశా. ఈ నీటి విడద దవాా సమా 2,800 ఎకాక సాగనీ అందనంది.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరటనిస్తూ, ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఎర్రకోట గ్రామంలోని ... మిట్ట సోమాపురం 1 కాలువకు సాగునీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదల ద్వారా సుమారు 2,800 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇప్పటికే పంటలు సాగు చేసిన రైతులకు ఈ నీరు అందడంతో తమ పంటలను కాపాడుకునే అవకాశం కలిగింది.
గత ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. రైతుల పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకుండా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన వైసీపీ పాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
కూటమి ప్రభుత్వ లక్ష్యం
గతంలో వైసీపీ పాలనలో రైతులు నీటి కోసం ఎదురుచూశారు. కానీ, కూటమి ప్రభుత్వం రైతుల పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేస్తోంది. రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు.
రాజకీయ వివక్ష లేని నీటి సరఫరా
ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఆయకట్టు ప్రాంతాలకు కూడా ఎలాంటి రాజకీయ వివక్ష లేకుండా నీటిని అందిస్తున్నామని ఎమ్మెల్యే గారు తెలిపారు. ప్రజలు ఏ పార్టీకి చెందిన వారైనా.. రైతు రైతే, నీరు ప్రతి రైతు హక్కు అనే విధానంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
రైతుల హర్షధ్వానాలు
కాలువకు నీరు విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల పంటలకు నీరు.. గ్రామాలకు తాగునీరు.. అభివృద్ధికి ప్రాధాన్యత ఇదే కూటమి ప్రభుత్వ విధానం అని వారు అభివర్ణించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఎల్ఎల్సీ డీఈ, ఏఈ, వైస్ చైర్మన్, వాటర్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులు, ఏఎంసీ చైర్మన్, టీడీపీ మండల అధ్యక్షులు, నాయకులు, గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.











