ఎమ్మిగనూరు, 2026-06-05
,ఎఎథఎూజఊచ.ఎఎ..జశళీచశ.ీ2,800ఎఆీ.
వర్షాభావం, ఎల్నినో ప్రభావంతో ఎండిపోతున్న పంటలను ఆదుకునేందుకు ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట వద్ద ఉన్న మిట్ట సోమాపురం కాలువకు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి మంగళవారం సాగునీటిని విడుదల చేశారు. ఈ చర్యతో నియోజకవర్గంలోని సుమారు 2,800 ఎకరాల ఆయకట్టుకు తక్షణమే నీరందనుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో సకాలంలో నీరందక రైతులు ఇబ్బందులు పడ్డారని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పార్టీలతో సంబంధం లేకుండా రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కాలంలో ఉన్న ఆయకట్టు ప్రాంతాలకు సైతం ఎలాంటి రాజకీయ వివక్ష లేకుండా నీటిని సరఫరా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్ఎల్సి అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.











