కడిమెట్ల (సూర్య పత్రిక) సెప్టెంబర్ 02
ఎమ్మిగనూరు మండలం కడిమెట్లలో పట్టాదారు పాస్‌బుక్ పంపిణీ గ్రామసభ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు నూతన పట్టాదారు పాస్‌బుక్కులను పంపిణీ చేశారు. ఈ పాస్‌బుక్కులలో పూర్తి వివరాలు పొందుపరిచి రైతులకు భద్రత కల్పించామని ఎమ్మెల్యే తెలిపారు.
ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్‌బుక్ పంపిణీ గ్రామసభ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు నూతన పట్టాదారు పాస్‌బుక్కులను పంపిణీ చేశారు.
కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లో ప్రభుత్వ లోగో, క్యూఆర్ కోడ్, చుట్టుపక్కల భూముల హద్దులు, ఎల్‌పీఎ నంబర్లు వంటి పూర్తి వివరాలను పొందుపరిచి రైతులకు మరింత భద్రత, పారదర్శకత కల్పించామని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. గతంలో రాజకీయ ఆధిపత్యానికి పేరుగాంచిన కడిమెట్లలో ఇప్పుడు రాజకీయాలు కాదని, అభివృద్ధి, సంక్షేమమే తమ అజెండా అని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ, ప్రాంతం చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ విధానమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్-6 సంక్షేమ పథకాల ద్వారా కడిమెట్ల ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ఎమ్మెల్యే వివరిస్తూ, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల లబ్ధిదారుల పేర్లను స్వయంగా చదివి వినిపించారు.
ఎన్నికలప్పుడు కనిపించే రాజకీయాలు కాదని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని, రైతుల భూమికి భద్రత, ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి తమ లక్ష్యమని, ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే ఎమ్మెల్యే డా. బీవీ జయ నాగేశ్వర రెడ్డి పాలన అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదోని ఆర్డీఓ, ఎమ్మిగనూరు మండల ఎంఆర్ఓ, ఏఎంసీ చైర్మన్, పీఏసీఎస్ అధ్యక్షులు, డైరెక్టర్లు, ఎంపీడీఓ, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.











